Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలో కొండపై ఉన్న 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 63,759 మంది భక్తులు దర్శించుకోగా 30,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు వచ్చిందని వివరించారు.
ఇదే తరుణంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.