Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్‌పై ముమ్మర తనిఖీలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌ను గుర్తించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ఒక నైజీరయన్‌ను అరెస్ట్ చేశామని, మణికొండకు చెందిన సేలం సాయి కృష్ణ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని.. వారి వద్ద నుంచి 30 గ్రాముల మేటఫెట మైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో పట్టుబడ్డ నైజీరియన్‌కు నేర చరిత్ర ఉందని, పూణేలో డ్రగ్స్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉన్నాడన్నారు. స్టూడెంట్ వీసాపై వచ్చిన నైజీరియన్ వీసా సమయం అయిపోయినా కూడా ఇక్కడే ఉంటున్నాడని, ముంబై పూణేలలో ఉంటూ డ్రగ్ సేకరించి సరఫరా చేస్తున్నాడన్నారు.