Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి చంద్రయ్యతో కలిసి షాలిని హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తున్న తరుణంలో కిడ్నాప్‌కు గురైంది. దేవాలయం వెలుపల కారులో కాపు కాసిన నలుగురు యువకులు యువతి బయటకు వచ్చిన వెంటనే తండ్రిని కొట్టి బలవంతంగా లాక్కెళ్లారు.
యువతిని బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. యువతి కిడ్నాప్‌కు సంబంధించి ఫోక్సో కేసులో జైలుకి వెళ్లి వచ్చిన యువకుడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.