Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి కెవిన్ రుడ్ అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న ఆంథోని అల్బనెసె మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. కెవిన్‌కు నాయకుడిగా, విదేశాగం శాఖ మంత్రిగా పని చేసిన అనుభం ఉంది. చైనా- అమెరికా సంబంధాలపై విస్తృతుంగా అధ్యయనం చేసిన ఆయన గతంలో అమెరికాలో కొన్నాళ్లు పనిచేశారు. ఈ పదవికి ఆయన అన్ని విధాలా అర్హుడు అని అంథోని తెలిపారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో కెవిన్ అమెరికా అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. భద్రతాపరంగా అమెరికా, ఆస్ట్రేలియాకు కీలకమైన భాగస్వామి ఆని ఈ క్రమంలో కెవిన్ అన్నారు. తమదేశం గత దశబ్దాలుగా భద్రతా, దౌత్యపరమైన సంబంధాల్లో సవాళ్లు ఎదుర్కొంటున్నదని కెవిన్ తెలిపారు.