Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి కాపాడేందుకు పోలీసులు విస్తృతంగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్సు పోలీసులు బృందాలుగా వీడిపోయి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. రెండురోజులుగా ఈ దాడుల్లో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ. కోటి విలువైన 127 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి ఆరు ద్విచక్రవాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ వెల్లడించారు. చెన్నైకి చెందిన మురుగన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.