Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నకిలీ మద్యాన్ని పట్టుకున్న అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు. తరుణంలతో మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి ఖాళీ బాటిల్స్, లేబుల్స్ తీసుకెళ్లి ఒడిశాలోని కటక్ అటవీ ప్రాంతంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్నారు.
మొత్తం నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు అయ్యిందన్నారు. ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా తయారు చేస్తున్నారని, రూ. రెండున్నర కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నామన్నారు. నకిలీ మద్యం అమ్మకాలు, తయారు చేసేవారిని వదిలిపెట్టమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.