Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో ఉన్న ఒక స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దొరహ పట్టణంలో రాంపూర్ రోడ్డుకు ఉన్న గ్రేట్ ఇండియన్ స్టీల్ కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వర్కర్లు అక్కడికక్కడే చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలోని గ్యాసిఫికేషన్ యూనిట్‌లో ఉన్న బాయిలర్ పేలింది. ప్రమాద సమయంలో అక్కడ ఆరుగురు కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదం జరగడంలో ఆ యూనిట్ అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం అని డీఎస్పీ హరిసిమ్రత్ సింగ్ తెలిపారు. బాయిలర్ పేలుడు సంభవించిన వెంటనే ఆరుగురిని దగ్గర్లోని సిద్దూ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వాళ్లలో ఇద్దరు చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. మృతులను వినయ్ సింగ్, రాహుల్ కుమార్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలు అయిన నలుగురికి చికిత్స అందిస్తున్నారు.