Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక ద్విభాషా చిత్రం రూపొందుతోంది. తెలుగులో 'వారసుడు' .. తమిళంలో 'వరిసు' అనే టైటిల్స్ ను ఖరారు చేశారు. విజయ్ జోడీగా రష్మిక నటించిన ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'అమ్మమ్మ నేనేమి వింటినమ్మా .. వాకిళ్ల నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా .. అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా' అంటూ ఈ పాట సాగుతోంది. తల్లీకొడుకుల అనుబంధానికి అద్దం పట్టే పాట ఇది.
తమన్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా చిత్ర ఆలపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.