Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. మేధావులతో సీఎం కేసీఆర్ సమావేశంకానున్నారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ విధివిధానాలను కేసీఆర్ మీడియాకు వెల్లడించనున్నారు. క్రిస్మస్ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ కార్యకలాపాలు చేపట్టనున్నారు. 6 రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ ప్రారంభంకానుంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో కిసాన్ సెల్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి కోసం పలు భాషల్లో పాటలు, సాహిత్యం సిద్ధం చేశారు. భారతీయ భాషల సాహిత్యకారులు, పాటల రచయితలకు కేసీఆర్ సూచనలు చేశారు.