Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీహార్‌లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉన్నది. అయినా తరచుగా మందు లభిస్తూనే ఉన్నది. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని ఇంట్లోనే పెద్దసంఖ్యలో మద్యం సీసాలు లభించాయి. మర్హౌరాలోని అధికార జేడీయూ నాయకుడు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడైన కామేశ్వర్ ఇంటిపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా దేశీయ, విదేశీ బ్రాండ్‌లకు చెందిన మద్యం సీసాలు లభించాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేసి, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత వారం అక్రమ మద్యం తాగడంతో రాష్ట్రంలో 70 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. ఇలా మద్యం తాగి మృతిచెందే వారి కుటుంబాలకు ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించదని సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు కూడా. అయితే ఆయన పార్టీకి చెందిన లీడర్ ఇంట్లోనే మద్యం లభించడం గమనార్హం