Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలం పెద్దచెరువు ఆంజనేయస్వామి గుడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై లారీని ఆపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.