Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్ జోడో యాత్రపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో సరైన కోవిడ్ మార్గదర్శకాలు పాటించబడుతున్నాయని నిర్ధారించుకోవాలని, కరోనా నిబంధనలను పాటించడం సాధ్యం కాకపోతే, 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ' పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రను మంత్రి నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి కోరారు. గుజరాత్‌లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఉదహరించింది. రాహుల్ గాంధీ యాత్రకు విపరీతమైన స్పందన రావడంతో పాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు.