Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, తితిదే చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలవారు శుభలేఖలు పంచుతున్నారు.
ఈ తరుణంలో చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి చనిపోయారు. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. ఆయన మృతిని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.