Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక సంస్థ త్వరలో 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే డిసెంబర్ 31లోపు ఈ నోటిఫికేషన్ రానునట్లు తెలిస్తుంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి ఏవైతే నిబంధనలను పాటిస్తుందో అదే విధానాన్ని స్టాఫ్ నర్సుల నియామకాల్లోనూ అనుసరించాలని వైద్యశాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థను ఆదేశించింది.
ఈ మేరకు నర్సుల పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులకు రెండు నెలలు సమయం కూడా ఇస్తారు. బహుళ ఐచ్ఛిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమిస్తారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.