Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిక్సిడ్ ఆక్యుపెన్సీ పేరుతో అనుమతి రాని కళాశాలలో చదువుతున్న విద్యార్ధులకు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులందరిని పరీక్షలకు అనుమతించాలని ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఇంటమిక్సిడ్ ఆక్యుపెన్సీ కల్గి ఉన్నారనే పేరుతో 465 ఇంటర్మియేట్ కళాశాలలకు బోర్డు అఫ్లియేషన్ ఇవ్వలేదని ఆ కళాశాలలో చదువుతున్న 80, వేల మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులకు పరీక్ష ఫీజులు కట్టలేదని, ఈ నెల 22 తో 1000 రూ ఫైన్ తో, 28 వ తేదీ నాటికి 5000 ఫీజు ఫైన్ తో చివరి అవకాశం ఉందని కానీ ప్రభుత్వం ఈ కళాశాలలపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలో తనిఖీలు చేసి నిబంధనలు ప్రకారం నడిచే కళాశాలలకు అనుమతులు ఇవ్వాలి కానీ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వహించి పరీక్షలు దగ్గరకు వస్తున్న సమయంలో పరీక్ష ఫీజులు కట్టించుకోకుండా విద్యార్ధులను ఇబ్బందులకు గురి చెయడం సరికాదని ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కమిటీ అభిప్రాయ పడుతుంది. 80 వేల మంది విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోకుంటే ఎస్.ఎఫ్.ఐ.ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఎస్.ఎఫ్.ఐ.తెలిపింది.