Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంగళవారం రాత్రి సరిహద్దులో దట్టమైన పొగమంచులో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ తరుణంలో డ్రోన్ శబ్ధం వినిపించడంతో అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరిపారు.ఇండో-పాక్ సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్ పోస్ట్ డాక్ వద్ద పాక్ ప్రయత్నాలను భారత దళాలు తిప్పికొట్టాయి. ఆ తర్వాత డ్రోన్‌ను పాక్ రేంజర్లు డ్రోన్‌ను తీసుకెళ్లారు.
డ్రోన్ చొరబాటుపై వెంటనే పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించినట్లు బీఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలుపగా ఆ తర్వాత బీఎస్‌ఎఫ్, పోలీసులు డావోకే గ్రామాన్ని చుట్టుముట్టి బుధవారం తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో భరోపాల్ గ్రామ సమీపంలో ఓ పొలంలో పసుపురంగు టేపు చుట్టిన ప్యాకెట్ కనిపించింది. దాంట్లో 4.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా హెరాయిన్ తప్పా మరే వస్తువులు దొరకలేదని తెలుస్తుంది.