Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇద్దరు అమెరికా టూరిస్టులను హత్య చేసిన కేసులో 2003లో అరెస్టయిన ఫ్రాన్స్‌కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలు నుంచి విడుదలవుతున్నారు. 19 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం, 78 ఏళ్ల వయసును దృష్టిలో ఉంచుకుని ఆయనను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి విడుదలైన 15 రోజుల్లోపే ఆయనను దేశం నుంచి పంపించేయాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చింది.
నకిలీ పాస్‌పోర్ట్‌తో నేపాల్‌లోకి అడుగుపెట్టిన శోభరాజ్ 1975లో అమెరికా పౌరుడు (29), అతని గాళ్‌ఫ్రెండ్ (26)ను హత్య చేశాడు. ఒక వార్తాపత్రికలో ఆయన ఫోటో ప్రచురితంకావడంతో 2003 సెప్టెంబర్ 1న నేపాల్‌లోని ఓ కేసినో బయట ఆయనను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. దీంతో ఖాట్మండు సెంట్రల్ జైలులో 21 ఏళ్ల పాటు శిక్ష అనుభవించారు.