Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఒక సాధువును హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ధోల్‌పూర్‌లోని భీమ్‌ఘర్ గ్రామానికి చెందిన మృతుడ్ని 60 ఏళ్ల మహముద్దీన్ ఖాన్‌గా గుర్తించారు.
ఆయన చాలా కాలం కిందట మతం మారారు. జిల్లాలోని చామర్ మాత ఆలయంలో పదేళ్లుగా పూజారిగా ఉన్నారు. అయితే బుధవారం నాలుగు ముక్కలుగా నరికి ఉన్న ఖాన్ మృతదేహం ఒక నది సమీపంలో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ముక్కలుగా నరికి పడేసిన ఖాన్ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కొందరు సాధువులతో ఆయనకు ఘర్షణ జరిగినట్లు తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ తరుణంలో ఖాన్‌ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఖాన్ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.