Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దట్టమైన పొగమంచు కారణంగా చండీఘడ్‌లో నాలుగు విమానాలు రద్దు చేశారు. చండీఘడ్ నుంచి బయలుదేరే 15 విమానాలు, 13 అరైవల్ విమానాలు సహా మొత్తం 28 విమాన సర్వీసులు బుధవారం రాత్రి వరకు ఆలస్యం అయ్యాయి. పొగమంచు కారణంగా విజిబిలిటీ 100 మీటర్లకు పడిపోయింది.రాబోయే రోజుల్లో ఒక మోస్తరు నుంచి దట్టమైన పొగమంచు కొనసాగుతుందని, ముఖ్యంగా అర్థరాత్రి, తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.