Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు, వైరా సొసైటీ మాజీ డైరెక్టర్, వైరా స్టడీ సర్కిల్ సభ్యులు కామ్రేడ్ బందెల పౌల్ (56) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. మరణవార్త తెలిసిన వెంటనే సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్ర, బొంతు రాంబాబు వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం గ్రామం నందు అమరజీవి కామ్రేడ్ బందెల పౌల్ భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ పతాకాన్ని కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మృతునికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, మెరుగు సత్యనారాయణ, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, కొణిజర్ల మండల కార్యదర్శి చెరుకుపల్లి కుటుంబరావు, మధు విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి వీరభద్రరావు, వైరా మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, టిఆర్ఎస్ నాయకులు ధార్నా రాజశేఖర్, పణితి సైదులు, సీపీఐ(ఎం) పార్టీ నాయకులు పారుపల్లి కృష్ణారావు, వాసిరెడ్డి విద్యాసాగర్, బోడపట్ల రవీందర్, మల్లెంపాటి రామారావు, చింతనిప్పు చలపతిరావు, మెరుగు రమణ, మచ్చా మణి, బొంతు సమత, గుడిమెట్ల రజిత, హరి వేంకటయ్య, బెజవాడ వీరభద్రం, గొల్లపూడి ప్రకాశరావు, పైడిపల్లి సాంబశివరావు, సంక్రాంతి నరసయ్య, గుడిమెట్ల మోహనరావు, గుమ్మా నరసింహారావు, షేక్ జమాల్, బానోత్ మధు, తోట కృష్ణవేణి, ఇమ్మడి సుదీర్, సర్పంచ్లు తుమ్మల జాన్ పాపయ్య, మంచాల జయరావు, నారికొండ అమరేందర్, పలు పార్టీల నేతలు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.