Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కర్నాటక రాజకీయ నాయకుడి ఫామ్‌హౌస్‌లో జింకలు, కృష్ణజింకలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన సంచలనం రేపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడు, ఎస్ఎస్ మల్లికార్జున్ కల్లేశ్వర్ ఫామ్‌హౌస్‌లో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను కర్ణాటక అటవీ శాఖ అధికారులు రక్షించారు.దావణగెరెలోని ఆనెకొండలో రైస్ మిల్లు వెనుక ఉన్న ఫామ్‌హౌస్‌లో 10 కృష్ణజింకలు, ఏడు మచ్చల జింకలు, ఏడు అడవి పందులు, మూడు ముంగిసలు, రెండు నక్కలను స్వాధీనం చేసుకున్నామని అటవీశాఖ అధికారులు చెప్పారు. కొన్ని వన్యప్రాణులను పెంచుకోవడానికి వారు అనుమతి పొందారని, కాని కొన్ని జంతువులను చట్టవిరుద్ధంగా పెంచుకుంటున్నారని అటవీశాఖ అధికారులు చెప్పారు. వన్యప్రాణుల పెంపకంపై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశామని ఐఎఫ్ఎస్ అధికారి చెప్పారు.