Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మరణించిన సంఘటన బుధవారం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో జరిగింది. విద్యార్ధిని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన జి.రాముడు తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె జి.భార్గవి(19), కుమారుడు ఉన్నారు. భార్గవి నందిగామలోని ఒక ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్లిన భార్గవి తనకు ఒంట్లో నలతగా ఉందని కళాశాలలో టాబ్లెట్ వేసుకుంది. మధ్యలోనే ఇంటికి బయలుదేరిన భార్గవి బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాహం వేయడంతో పక్కనే ఉన్న ప్రయాణికుల దగ్గర ఉన్న మంచినీరు అడిగి తాగింది. ఇంటికి వచ్చాక కడుపులో మంటగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో వారు మరో టాబ్లెట్ తెచ్చి వేశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో భార్గవిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మార్గంమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రాములు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.