Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్‌లో పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ అనే పేరుతో షాపును నిర్వహిస్తున్నారు. వినియోగదారుల నుంచి ఆర్డర్ తీసుకుని.. సూరత్ నుంచి బంగారం ముడి సరుకు తీసుకొచ్చి ఆభరణాలు చేయించి ఇస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం బంగారం ముడిసరుకును లాకర్‌లో పెట్టి దుకాణానికి తాళం వేసివెళ్లారు. బుధవారం ఉదయం షాపు తెరచి చూడగా రూ.కోటి విలువచేసే వజ్రాలు, బంగారం చోరీకి గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.