Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ లంచ్ సమయానికి 28 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి 82 రన్స్ చేసింది. ఓపెనింగ్ కు దిగిన బంగ్లా బ్యాటర్లు..జాకిర్ హసన్(15), నజ్ముల్ హొస్సేన్(24)ను జయదేవ్ ఉనద్కత్, రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ బాటపట్టించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షకీబ్ (16), మామినుల్ హక్ (23) నాటౌట్ గా నిలిచి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ఈ రెండు జట్లకు మ్యాచ్ కీలకం. ఈ రెండవ టెస్టును గెలిచి టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుండగా..మరోవైపు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని కసిమీద ఉంది. ఇప్పటికే ఈ టెస్టు సిరీస్ లో భారత జట్టు 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.