Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీకి చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్రమంత్రులను ఆమె కలవనున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో తమిళిసై చర్చించే అవకాశం ఉంది. తన పర్యటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, అసెంబ్లీ ఆమోదించిన తర్వాత తన వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.