Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చైనా తదితర దేశాల్లో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందన్న విషంయం తెలిసిందే. ఈ తరుణంలో ఓ వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ వేగంగా వ్యాపిస్తోందని, ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు ప్రమాదకరమైనదని, దీనివల్ల మరణాల రేటు అధికంగా ఉంటుందని ఈ మెసేజ్ హెచ్చరిస్తోంది. అంతేకాకుండా గతంలో వచ్చిన వేరియంట్ల లక్షణాలకన్నా కన్నా దీని లక్షణాలు పూర్తిగా భిన్నమైనవని చెప్తోంది.
అయితే దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇది తప్పుదోవ పట్టించే మెసేజ్ అని స్పష్టం చేసింది. ఈ మెసేజ్‌ను నమ్మవద్దని, ఇతరులకు పంపించవద్దని ప్రజలను తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎక్స్‌బీబీ వేరియంట్ అంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కన్నా ఎక్కువ ప్రాణాంతకమైనదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ ప్రాణాంతకమైనదని తెలిపింది.