Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లలో అదే విధమైన నష్టాల పర్వం కొనసాగుతోంది. దాంతో మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 60,826కి పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 18,127 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: అల్ట్రాటెక్ సిమెంట్ (0.71%), ఇన్ఫోసిస్ (0.68%), ఏసియన్ పెయింట్స్ (0.65%), కొటక్ బ్యాంక్ (0.58%), సన్ ఫార్మా (0.52%).
టాప్ లూజర్స్: మహీంద్రా అండ్ మహీంద్రా (-2.61%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.26%), టాటా మోటార్స్ (-2.12%), ఎల్ అండ్ టీ (-1.70%).