Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్ లో పార్టీ నేతలతో చర్చిస్తుండగా, వెలుపల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్ కుమార్ ను తిడతావా అంటూ పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అనిల్ ను ఓయూ విద్యార్థి కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ తరుణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చొక్కాలు పట్టుకుని నెట్టుకొని, ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు.
అనంతరం మల్లు రవి మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇలాంటి గొడవలు, కొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని శిరసు వంచి కోరుతున్నాన్నారు.