Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. దీంతో ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులకు యూపీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ప్రతిరోజూ వేలాది మంది దేశీయ, వీదేశీ పర్యాటకులు తాజ్ మహల్ సందర్శనకు వస్తుండడంతో కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే తాజ్ సందర్శనకు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజ్ ను చూడటానికి వచ్చేవాళ్లు సందర్శనకు ముందే కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.