Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో భారత్ లోనూ ఆందోళనలు నెలకొన్నాయి. చైనాలో కరోనా ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోనూ వెలుగుచూసింది. ఈ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను అప్రమత్తం చేసింది. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. గత 24 గంటల్లో భారత్ లో 145 పాజిటివ్ కేసులు నమోదైతే, వాటిలో నాలుగు కేసులో బీఎఫ్-7 వేరియంట్ కు చెందినవిగా తెలిపింది.
దేశంలో ఇప్పటికప్పుడు ప్రమాదకర పరిస్థితులేవీ లేవని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐఎంఏ అభిప్రాయపడింది. అయినప్పటికీ కేంద్రం 2021లో మాదిరే తగిన సన్నద్ధతతో సిద్ధంగా ఉండాలని, గతంలో కంటే అధికస్థాయిలో సన్నాహకాలు ఉండాలని సూచించింది.