Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: అనేక దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్.7 వేరియంట్ కేసులు నాలుగు నమోదవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. తాజాగా, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఆరోగ్యరంగ నిపుణులు ఈ వర్చువల్ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మాస్కులు, భౌతిక దూరం పాటించడం, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలతో నోట్‌ను జారీచేసే అవకాశం ఉంది.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్ టెస్టింగ్‌ను ప్రారంభించింది. మరో వారం రోజుల్లో క్వారంటైన్, టెస్టింగ్‌ల కోసం మౌలికసదుపాయాలు మరోసారి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశంలో ఇప్పటికే ప్రవేశించిన ఒమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్.7(BF.7) కేసులు జులై, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో గుజరాత్, ఒడిశాలలో రెండేసి చొప్పున మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఈ వైరస్ సోకిన ఇద్దరు రోగులు హోం ఐసోలేషన్‌లోనే పూర్తిగా కోలుకున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.