Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రతీ యేట అందించే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు 2022 సంవత్సరానికి గాను ఇద్దరు తెలుగు కవులకు లభించాయి. అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ఆకుపచ్చ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించగా అలాగే మధురాంతకం నరేంద్ర రాసిన మనో ధర్మపరాగం నవలకు తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఈ ఇద్దరకి అవార్డు లభించినట్లుగా కేంద్ర సాహిత్య అకాడమీ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రముఖ కవులలో ఒకరైన పద్మభూషణ్ గుల్జార్ భావకవి. గుల్జార్ రాసిన గ్రీన్‌పోయెమ్స్‌ని పవన్ కే వర్మ ఆంగ్లానువాదం తోడ్పాటుతో ఆకుపచ్చ కవితలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ.50వేల నగదును అందజేయనున్నారు.