Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చైనాలో ఇప్పుడు నెలకొన్న భయానక పరిస్థితులకు ఈ కొత్త వేరియంటే కారణం. బీఎఫ్-7 రకాన్ని భారత్ లోనూ గుర్తించడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో, బీఎఫ్-7 కరోనా వేరియంట్ సోకితే మానవుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయన్న దానిపై నిపుణులు వివరణ ఇచ్చారు. గతంలో వ్యాపించిన కరోనా వైరస్ రకాలు ఎలాంటి లక్షణాలు కలిగించిందో, బీఎఫ్-7 కూడా దాదాపు అలాంటి లక్షణాలే కలిగిస్తుందని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రి సీనియర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ మహర్షి దేశాయ్ తెలిపారు.
సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయని, కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన దగ్గు, అలసట, ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఈ వైరస్ జన్యువులు తరచుగా రూపాంతరం చెందుతుంటాయని, అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.