Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహించే కామ్లే రమేష్ 50 సంవత్సరాల అనే వ్యక్తి బైక్ మీద నుండి పడి మృతి చెందాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ వైపు నుండి మేనూర్ మీదుగా డోంగ్లి రహదారి గుండా బైక్ పై వెళ్తున్న ఫార్మసిస్ట్ రమేష్ ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.
జరిగిన ఘటన సమాచారాన్ని తెలుసుకున్న ఎస్ఐ శివకుమార్ అక్కడికి చేరుకొని బంధువుల ఫిర్యాదు మేరకు శవ పంచనామా జరిపి పోస్ట్ మార్టం నిమిత్తం మద్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శివకుమార్ గురువారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. మృతుడు మద్నూర్ వైపు నుండి డోంగ్లి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఎస్ఐ తెలిపారు. ఫార్మసిస్టు బాన్సువాడలో నివాసముంటున్నట్లు తెలిపారు.