Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న తరుణంలో తాజాగా మరో నోటిఫికేషన్ లో వెటర్నరీ, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు, హార్టికల్చర్ విభాగంలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు జనవరి 3 నుంచి అదే నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తదితర వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ www.tspsc.gov.in ను సందర్శింవచ్చు.