Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో గాయం కారణంగా దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మళ్ళి జట్టులోకి రానున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో (27, 29, ఫిబ్రవరి 1) సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేసిన 14 మంది సభ్యుల బృందంలో జోఫ్రా చోటు దక్కించుకున్నాడు.
2021 మార్చిలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ (ఇండియాపై) ఆడాడు. మోచేయి, వెన్నెముక సర్జరీలు చేయించుకున్న జోఫ్రా.. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలే ఓ వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఇంగ్లాండ్ లయన్స్-ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జోఫ్రా మునుపటి వేగాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా ఈసీబీ జోఫ్రాను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది.
సౌతాఫ్రికా టూర్‌కు ఇంగ్లాండ్ జట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, మొయిన్ ఆలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డక్కెట్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిలిప్ సాల్ట్, ఓల్లీ స్టోన్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్