Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఈ వేకువజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కైకాల మృతితో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కైకాల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కృష్ణాజిల్లా కౌతారం గ్రామంలో 1935న సత్యనారాయణ జన్మించారు. గుడివాడ కాలేజీలో ఆయన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సత్యనారాయణలోని టాలెంట్‌ను ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ గుర్తించి 'సిపాయి కూతురు'లో అవకాశం ఇచ్చారు. పౌరాణికం, జానపదం, కమర్షియల్.. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్‌గా ఆయన కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ నటించారు.