Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమెరికాలో వాతావరణశాఖ బాంబు తుపాన్ హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో బాంబు తుపాన్ హెచ్చరికతో క్రిస్మస్ సీజనులో వేలాది విమానాల రాకపోకలను రద్దు చేశారు. చలి గాలులతో కూడిన బాంబు తుపాన్ 135 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేయవచ్చని వాతావరణశాఖ శాస్త్రవేత్త అష్టన్ రాబిన్సన్ కుక్ చెప్పారు. డెస్ మోయిన్స్, అయోవా వంటి ప్రదేశాల్లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ సూచించారు.ఈ తుపాన్ వల్ల భారీగాలులు, మంచు కురుస్తుందని కుక్ చెప్పారు.గత వారం సంభవించిన మంచు తుపానుతో ఐదుగురు మరణించారు. ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. తుపాన్ సహాయ పనుల కోసం సైనికులను మోహరించారు.