Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో మరో లెజెండ్ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవలి కాలంలో కృష్ణంరాజు, కృష్ణలను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన టాలీవుడ్ సత్యనారాయణ మరణవార్తలో షాక్ కు గురైంది. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... విభిన్న పాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానుల చేత నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్న మేటీ నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ అని చెప్పారు.