Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేట్ దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి స్ట్రే కౌన్సెలింగ్ నోటిఫికేషన్, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. బీడీఎస్ మాప్ అప్ విడుత కౌన్సెలింగ్ అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి శనివారం మధ్యాహ్నం 2 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ నాలుగేండ్ల డిగ్రీ కోర్సు, పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ రెండేండ్ల డిగ్రీ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయన్నట్టు పేర్కొన్నారు. అర్హతగల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 9 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 2 వరకు కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చని సూచించారు.