Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దరఖాస్తుల కోసం కొత్త తేదీలను వెల్లడించింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది.