Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు గుండెపోటు కారణంగా కుప్పకూలిపోగా.. భద్రతా సిబ్బంది కాపాడారు. సదరు ప్రయాణికుడు ముంబై వెళ్లాల్సి ఉంది. గుండె పోటుతో పడిపోవడంతో విమానాశ్రయ భద్రతను చూసే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సబ్ ఇన్ స్పెక్టర్ కపిల్ రాఘవ్ చురుగ్గా స్పందించారు. నేలపై సమాంతరంగా పడుకోబెట్టి కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) నిర్వహించారు. దీంతో సదరు ప్రయాణికుడికి ప్రాణం లేచి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పై ఓ జవాను షేర్ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ సైతం తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. 'సీఎఫ్ఎస్ఎఫ్ జవాను సత్వర స్పందన అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రాణాన్ని కాపాడింది. ఈ గొప్ప దళానికి వందనాలు' అంటూ దేవధర్ పోస్ట్ పెట్టారు.