Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో సీనియర్ నేతలు సమన్వయం పాటించాలి. పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దు. ఎంతపెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలి.ఇప్పటికే రేవంత్‌రెడ్డి నన్ను కలిశారు. చిన్న వయస్సులో ఉన్నవారికి పీసీసీ ఇస్తే తప్పేంటి?. కొత్తవారికి పీసీసీ చీఫ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి్ణ్ణ అని ద్విగిజయ్ పేర్కొన్నారు.