Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ ఇవాళ నేపాల్‌లోని సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్‌ను రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శోభరాజ్ ఆరోగ్యం క్షీణించిందని, సత్ప్రవర్తన కారణంగా అతన్ని రిలీజ్ చేయాలని కోర్టు పేర్కొన్నది. 78 ఏళ్ల శోభరాజ్ జైలు నుంచి రిలీజైనట్లు ఇవాళ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొన్నది. అతనికి పాస్‌పోర్ట్ ఇచ్చిన దేశానికి .. శోభరాజ్‌ను డిపోర్ట్ చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. 2003 సెప్టెంబర్‌లో నేపాలీ పోలీసులు శోభరాజ్‌ను అరెస్టు చేశారు. కాసినో రాయల్‌లో ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసియా, యూరోప్‌లో జరిగిన అనేక నేరాల్లో శోభరాజ్ నిందితుడు.