Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లి కైకాల మృతదేహంపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కైకాల అంత్యక్రియలు ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. మూడు తరాల పాటు అనేక చిత్రాలు, వివిధ పాత్రలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యనారాయణ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కు తీరని లోటని మంత్రి అన్నారు.