Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈఆ తరుణంలో తాజాగా తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. మేయర్ గా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ గా మొహమ్మద్ ఇక్బాల్ పేర్లను డిక్లేర్ చేసింది. కౌన్సిలర్ గా షెల్లీ ఒబెరాయ్ తొలిసారి గెలుపొందారు. అంతకు ముందు ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. ఢిల్లీ మేయర్ గా మహిళకు అవకాశం ఇస్తామని ఇంతకు ముందే ఆప్ ప్రకటించింది. చెప్పిన విధంగానే షెల్లీని టాప్ పోస్టుకు ఎంపిక చేసింది.