Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అమెరికన్ టూరిస్టు కోనీ జో బ్రాంజిచ్, అతడి కెనడా ఫ్రెండ్ లారెంట్ కారియర్ లను హత్య చేసిన కేసులో చార్లెస్ శోభరాజ్ కు నేపాల్ కోర్టు జీవితఖైదు విధించగా, క్షీణించిన ఆరోగ్యం, మెరుగైన ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేయాలంటే నేపాల్ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చిన విషయం తెలతిసిందే. ఈ తరణంలో చార్లెస్ శోభరాజ్ (78) నేపాల్ లోని ఖాట్మండు జైలు నుంచి నేడు విడుదలయ్యాడు దీంతో జైలు జీవితం నుంచి విముక్తి కలిగింది. అతడిని నేపాల్ అధికారులు ఫ్రాన్స్ కు పంపించివేయనున్నారు.
1970వ దశకంలో వరుస హత్యలతో చార్లెస్ శోభరాజ్ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా, పాశ్చాత్యదేశాల నుంచి వచ్చే టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని, వారికి డ్రగ్స్ ఇచ్చి మత్తులో ముంచేయడం, అందినంత దోచుకోవడం, ఆపై వారిని తగలబెట్టడం చేసేవాడు. మొత్తమ్మీద 20 వరకు హత్యలు చేశాడు. థాయలాండ్ లోని పట్టాయా బీచ్ లో ఆరుగురు మహిళలను ఇలాగే హతమార్చాడు. వారందరూ బికినీలు ధరించిన స్థితిలో విగతజీవులుగా పడివున్నారు. అప్పటినుంచి చార్లెస్ శోభరాజ్ కు బికినీ కిల్లర్ అనే పేరు స్థిరపడిపోయింది. ఓసారి ఢిల్లీలో ఫ్రెంచ్ విద్యార్థులకు మత్తుమందు ఇచ్చిన కేసులో తీహార్ జైలుకు వెళ్లాడు. అయితే తన పుట్టినరోజు అని చెప్పి జైలు అధికారులకు నిద్రమాత్రల పొడి కలిపిన స్వీట్లు, కేకు ముక్కలు ఇచ్చి, వారు మత్తుకు గురయ్యాక జైలు నుంచి పారిపోయాడు. ఈ ఘటన 1986లో జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన 22 రోజులకే శోభరాజ్ ను మధుకర్ జెండే అనే పోలీసు అధికారి గోవాలో పట్టుకున్నాడు.