Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి 16 మంది జవాన్లు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో శుక్రవారం ఉదయం
ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉదయం ఆర్మీ కాన్వాయ్ ఛట్టెన్ నుంచి థంగు ప్రాంతంలోని బోర్డర్ పోస్ట్‌లకు మూడు వాహనాలలో వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఇందులోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి లోయలో పడింది. ఘటన సమయంలో ట్రక్కులో 20 మంది జవాన్లు, జూనియర్ కమిషన్ అధికారులున్నారు. వందల అడుగుల ఎత్తు నుంచి పడటంతో వాహనం తునాతునకలైంది. సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద స్థలంలో 16 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు జూనియర్ కమిషన్ అధికారులు, 13 మంది జవాన్లు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన నటుగురిని హెలికాప్టర్లలో ఉత్తర బెంగాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు ఏ రెజిమెంట్‌కు చెందినవారన్నది ఇంకా తెలియరాలేదు.