Authorization
Fri May 16, 2025 03:21:17 pm
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు సత్యనారాయణ భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ తరుణంలో ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రముఖ సినీ నటులు కైకాల సత్యనారాయణగా తన విలక్షణమైన నటనాశైలితో పేరు, ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని, హీరోలకు ఉండేంత గ్లామర్ ఆయనదని అన్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో సజీవంగా జీవిస్తూ అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. కొంత కాలం తామంతా కలిసి పనిచేశామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ కైకాల వంటి సీనియర్ ని కోల్పోవడం బాధాకరమని, సత్యనారాయణగారు లేని లోటును ఎవరూ పూడ్చలేరని అన్నారు.