Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్ నారాయణగూడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో నరేంద్ర మోడీ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్ని భ్రష్టు పట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కేంద్రాన్ని ప్రశ్నించే వారిని అణిచివేయడం, ఈడీ, సీబీఐ దాడులతో బెదిరించడం మోడీకి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అన్నారు.
మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అమలు చేసినట్టు నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటానని బండి సంజయ్ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా పలు హామీలిచ్చి అమలు చేయలేదు. మరి కేంద్రం అమలు చేయనందుకు కూడా చెప్పుతో కొట్టుకుంటాడా? అని సాంబశివరావు ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ మాటను కూడా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.